సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (13:31 IST)

టమోటా గుజ్జు, నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుంటే?

టమోటా గుజ్జును తీసుకుని అందులో రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కనీసం 20 నిమిషాల పాటూ ఉంచి, తరువాత కడిగి వేయాలి. టమోటాలో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం, సూర్యకాంతి వలన డ

పెరుగు అంటే దాదాపు మనలో అందరికీ ఇష్టమే. పెరుగు వలన ఆరోగ్యానికే కాదు, సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును మన చర్మానికి అప్లై చేసి కొద్ది నిమిషాల పాటూ అలాగే ఉంచి కడగి వేయండి. దీనిలో ఉండే లాక్టిక్ ఆసిడ్ చర్మ రంద్రాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలను తొలగించి మెరిగే సౌందర్యాన్నిస్తుంది.

రాత్రి నిద్రించేందుకు ముందు ఒక చెంచా ఉసిరిరసాన్ని, ఒక చెంచా తేనెను కలపి ముఖానికి అప్లై చేసి పడుకోండి. మరుసటి రోజు కడిగి వేసి తరువాత కలిగే మార్పులను గమనించండి 
 
అలాగే టమోటా గుజ్జును తీసుకుని అందులో రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కనీసం 20 నిమిషాల పాటూ ఉంచి, తరువాత కడిగి వేయాలి. టమోటాలో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం, సూర్యకాంతి వలన డల్‌గా మారిన చర్మాన్ని తిరిగి పునరుద్ధరణకు గురిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.