ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (22:24 IST)

కడపలో కల్యాణ్ జ్యుయలర్స్ షోరూమ్‌ను ప్రారంభించిన ప్రముఖ నటి శ్రీలీల

Sreeleela
భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, దిగ్గజ జ్యుయలరీ సంస్థల్లో ఒకటైన కల్యాణ్ జ్యుయలర్స్, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో కొత్తగా తీర్చిదిద్దిన షోరూమ్‌ను నేడు ప్రారంభించింది. ప్రముఖ నటి శ్రీలీల ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. కల్యాణ్ జ్యుయలర్స్‌కి చెందిన విస్తృత శ్రేణి డిజైన్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులకు అత్యుత్తమమైన, ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతిని అందించేలా సకల సదుపాయాలతో ఈ షోరూమ్ తీర్చిదిద్దబడింది.
 
కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, “కల్యాణ్ జ్యుయలర్స్ కొత్త షోరూమ్ భారీ ప్రారంభోత్సవానికి హాజరు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. విశ్వసనీయత, నిజాయితీ, కస్టమర్ల పట్ల నిబద్ధత కలిగిన బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించగలగడం ఎంతో గర్వకారణం. ఆకర్షణీయమైన ఆభరణాల కలెక్షన్‌తో ఇక్కడి ఆభరణాల ప్రేమికులను కల్యాణ్ జ్యుయలర్స్ నిస్సందేహంగా ఆకట్టుకోగలదు” అని నటి శ్రీలీల తెలిపారు.
 
కొత్త షోరూమ్ ఆవిష్కరణపై మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్తగా తీర్చిదిద్దిన కల్యాణ్ జ్యుయలర్స్ షోరూమ్‌ను ప్రారంభించడం ద్వారా మా కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా ఆభరణాలను అందించే సమగ్ర వ్యవస్థను అందుబాటులోకి తేవడం, వారికి అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని కలిగించడమనేది మా లక్ష్యం. విశ్వసనీయత, పారదర్శకత అనే మూలసూత్రాలకు కట్టుబడి ఉంటూనే కస్టమర్లకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించేందుకు ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము సరికొత్తగా తీర్చిదిద్దుకుంటూనే ఉంటున్నాము. నాణ్యత, సేవపై ప్రధానంగా దృష్టి పెట్టి విస్తృతమైన, విశిష్టమైన ఆభరణాల డిజైన్లను అందించడం కొనసాగిస్తాము” అని కల్యాణ్ జ్యుయలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రమేష్ కల్యాణరామన్ తెలిపారు.
 
షోరూమ్ ప్రారంభం సందర్భంగా కొనుగోలుదారులకు విస్తృతమైన ఆఫర్లు అందిస్తున్నట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ప్రకటించింది. అన్ని ఉత్పత్తులపైనా మేకింగ్ చార్జీలపై ఫ్లాట్ 25 శాతం డిస్కౌంటును అందించనున్నట్లు తెలిపింది. అలాగే అక్షయ తృతీయ కోసం బుకింగ్స్‌ను కూడా సంస్థ ప్రారంభించింది. కొనుగోలుదారులు 5 శాతం అడ్వాన్స్ చెల్లించి పసిడి ధరను లాక్ చేసుకోవడం ద్వారా కల్యాణ్ జ్యుయలర్స్ నుంచి ఆభరణాలను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ లాకిన్ ధర కన్నా బంగారం ధర తగ్గిన పక్షంలో ఆ తక్కువ ధరకే పొందవచ్చు. తద్వారా బంగారం రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవచ్చు.
 
కల్యాణ్ జ్యుయలర్స్‌లో విక్రయించే ఆభరణాలన్నీ బీఐఎస్ హాల్‌మార్క్ కలిగి ఉంటాయి. స్వచ్ఛతకు సంబంధించి వాటికి పలు కఠినమైన పరీక్షలు నిర్వహించబడతాయి. స్వచ్ఛతకు భరోసా కల్పించేలా కొనుగోలుదారులకు కల్యాణ్ జ్యుయలర్స్ 4-లెవెల్ అష్యూరెన్స్ సర్టిఫికెట్, ఆభరణాలకు ఉచిత లైఫ్‌టైమ్ మెయింటెనెన్స్, ఉత్పత్తికి సంబంధించి సవివరమైన సమాచారం అందించడంతో పాటు పారదర్శకమైన ఎక్స్చేంజ్, బై-బ్యాక్ విధానాలను సంస్థ అమలు చేస్తోంది.
 
షోరూమ్‌లో పేరొందిన కల్యాణ్ జ్యుయలర్స్ హౌస్ బ్రాండ్స్ అన్నీ లభిస్తాయి. ముహూరత్ (వెడ్డింగ్ జ్యుయలరీ కలెక్షన్), ముద్ర (హ్యాండ్‌క్రాఫ్టెట్ యాంటిక్ జ్యుయలరీ), నిమహ్ (టెంపుల్ జ్యుయలరీ) అనోఖి (అన్‌కట్ డైమండ్స్) మొదలైనవి వీటిలో ఉన్నాయి.