శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (21:29 IST)

బ్లూ డార్ట్ ఇక భారత్ డార్ట్ ప్లస్‌గా మారిపోయింది..

Blue Dart
Blue Dart
కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో.. ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ బ్లూ డార్ట్ పేరు మార్చింది. 
 
స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో భారత్ అనే పేరు వచ్చేలా మార్చుకోనుంది. బ్లూ డార్ట్ తన డార్ట్ ప్లస్ సర్వీస్‌ను భారత్ డార్ట్‌ ప్లస్‌గా రీబ్రాండ్ చేసింది. తద్వారా కంపెనీ షేర్లు రెండు శాతం కంటే పెరిగాయని బ్లూ డార్ట్ పేర్కొంది. ఇకపై బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ సర్వీసులు భారత్ డార్ట్ పేరుతో కొనసాగనున్నట్లు సంస్థ ప్రకటించింది. 
 
కాగా, బ్లూ డార్ట్‌ను భారత్ డార్ట్‌గా మార్చేందుకు గల కారణాలను సంస్థ వివరించింది. తమ వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఒక విస్తృతమైన ఆవిష్కరణ, పరిశోధన ప్రక్రియ నుంచి వచ్చినట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.