శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 డిశెంబరు 2022 (21:57 IST)

షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌లో క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు

christmas celebration
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే సీజన్‌ వచ్చింది. మరుపురాని క్షణాలను స్నేహితులు, ప్రియమైన వారితో పంచుకునేలా  వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ క్రిస్మస్‌ సీజన్‌లో విలాసవంతమైన విందును ఆస్వాదించేలా ప్రత్యేకమైన ఏర్పాట్లును షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌ చేసింది.
 
ఎలాంటి పండుగైనా  విందు అనేది అంతర్భాగంగా ఉంటుందని అందరికీ తెలిసినదే. ఈ పండుగ స్ఫూర్తిని వైభవంగా వేడుక చేసేందుకు షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌ అపరిమిత, విలాసవంతమైన క్రిస్మస్‌ విందును తమ సిగ్నేచర్‌ రెస్టారెంట్‌లో తీసుకువచ్చింది.
 
ఈ క్రిస్మస్‌ ఈవ్‌ డిన్నర్‌, జెగా మరియు ఫీస్ట్‌ వద్ద డిసెంబర్‌ 24, రాత్రి 7 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ధర 2650 రూపాయల నుంచి ఉంటుంది.   క్రిస్మస్‌ బ్రంచ్‌ను డిసెంబర్‌ 25, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకూ ఉంటుంది. ధర 2750 రూపాయలు.