సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:02 IST)

ఏఎస్‌9415 సప్లయర్‌ పీపీఏపీ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టిన సైయెంట్‌

అంతర్జాతీయ ఇంజినీరింగ్‌ మరియు డిజిటల్‌ సాంకేతిక పరిష్కారాల కంపెనీ సైయెంట్‌, నేడు తాము ఏఎస్‌ 9145 సప్లయర్‌ ప్రొడక్షన్‌ పార్ట్‌ అప్రూవల్‌ (పీపీఏపీ) ప్లాట్‌ఫామ్‌లో తమ ఏరోస్పేస్‌ డిజిటలైజేషన్‌ ఆఫరింగ్‌లో భాగంగా పెట్టుబడులు పెట్టినట్లుగా వెల్లడించింది.

అంతర్జాతీయంగా ఈ వేదికను ఆరంభించడం ద్వారా విక్రయం, అమలు మరియు మద్దతును అందించడంలో సైయెంట్‌ సహాయపడటంతో పాటుగా అదే సమయంలో అనుసంధానత, అనుకూలీకరణ సేవలను కూడా అందిస్తుంది. ఈ సమగ్రమైన ప్రయత్నాలలో ఫీట్‌ ఆన్ ద స్ట్రీట్‌ లేదా వెబ్‌ సమావేశాలు సైతం ఉండి సరఫరాదారులకు వేగవంతంగా ఈ ప్లాట్‌ఫామ్‌ యొక్క నిర్వహణ మరియు ఆర్థిక ప్రయోజనాలను సైతం అర్థం చేసుకోవడంలో సహాయపడుతూనే అత్యంత క్లిష్టమైన పీపీఏపీ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ సమర్పించడంలోనూ సహాయపడుతుంది.
 
అడ్వాన్స్‌ ప్రొడక్ట్‌క్వాలిటీ ప్లానింగ్‌ (ఏపీక్యుపీ) మరియు పీపీఏపీ  ప్రదర్శన మరియు డాక్యుమెంటింగ్‌ కోసం తగిన అవసరాలను సైతం ఏఎస్‌ 9145 తీరుస్తుంది. నేపథ్యీకరణ ఉత్పత్తి అవసరాలతో  ఏపీక్యుపీ ప్రారంభం కావడంతో పాటుగా ఉత్పత్తి నిర్వచనం, ఉత్పత్తి ప్రణాళిక, ఉత్పత్తి మరియు ప్రక్రియ ధృవీకరణ (పీపీఏపీ), ఉత్పత్తి వినియోగం మరియు డెలివరీ అనంతర సేవలను సైతం అందిస్తుంది. ఇంటర్నేషనల్‌ ఏరోస్పేస్‌ క్వాలిటీ గ్రూప్‌ (ఐఏక్యుజీ) ఈ ప్రయత్నాలకు తగిన మద్దతునందిస్తూ పలు స్ర్పెడ్‌షీట్స్‌ను సైతం ప్రచురించింది.
 
ఈ సందర్భంగా పియార్రీ కార్పెంటీర్‌, ఏవీపీ డిజిటల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌, సైయెంట్‌ మాట్లాడుతూ ‘‘ఏఎస్‌ 9145 సప్లయర్‌ పీపీఏపీ ప్లాట్‌ఫామ్‌తో  కంపెనీలు ఇప్పుడు మాన్యువల్‌ ప్రక్రియలు మరియు సియోలెడ్‌ స్ర్పెడ్‌షీట్‌ డాటాను  మరింత విస్తృతస్థాయి మరియు సురక్షిత క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌తో భర్తీ చేస్తారు. ఇది తాజా పరిశ్రమ అత్యుత్తమ ప్రక్రియలకు కట్టుబడి ఉండటంతో పాటుగా  సమ్మతి అవసరాలకు సైతం కట్టుబడి ఉంటుంది’’ అని అన్నారు.
 
ఏఎస్‌9145 సప్లయర్‌ పీపీఏపీ డిజిటైజేషన్‌ ప్రయత్నాలు సాఫ్ట్‌వేర్‌ ప్రయత్నాలకు మించినవి. సుదీర్ఘకాలంగా నూతన ఉత్పత్తి పరిచయం (ఎన్‌పీఐ) చేస్తున్నప్పుడు, మరియు ఇటీవల కాలంలోనే జీరో డిఫెక్ట్స్‌ (జెడ్‌డీ) చేస్తున్నప్పుడు ఏరోస్పేస్‌ పరిశ్రమ ఏపీక్యుపీ ఎందుకు అవసరమో అర్ధం చేసుకోవడంలో సహాయపడే సమగ్రమైన ప్రయత్నం మరియు దశాబ్దాలుగా ఫస్ట్‌ ఆర్టికల్‌ ఇన్‌స్పెక్షన్‌ (ఎఫ్‌ఏఐ)చేసినప్పుడు పీపీఏపీ ఖర్చును వారు ఎందుకు భరించాలనేది కూడా తెలుపుతుంది.
 
అంతేకాదు, ఈ ప్రయత్నాలు జాన్‌ ఎం కాచట్‌ నేతృత్వంలోని ఏరోస్పేస్‌ పరిశ్రమ డిజిటలైజేషన్‌ ఉపకరణం మొహరించాలనే ప్రయత్నమూ వెల్లడిస్తుంది. ఏఐక్యుజీ ఏఎస్‌ 9145 అమలు బృందానికి సహ నేతృత్వాన్ని జాన్‌ చేయడంతో పాటుగా అంతర్జాతీయంగా విమానయాన కంపెనీలతో ఏఎస్‌ 9145 సప్లయర్‌ పీపీఏపీ ప్లాట్‌ఫామ్‌ సమ్మతి అంశాలను గురించి సంభాషించారు. దీనిలో భాగంగా నాన్‌ ఇంటిగ్రేటెడ్‌ స్ర్పెడ్‌షీట్స్‌ అనుమతి కోసం ఒకవేళ ఎఫ్‌ఏఐ డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌ కోసం ప్రస్తుత సరఫరా పోర్టల్స్‌  ప్రొడక్ట్‌ లయబిలిటీ  వినియోగిస్తే అది ఉత్పత్తి బాధ్యత  సమస్యలను సృష్టించవచ్చు.
 
‘‘స్టాండలోన్‌ స్ర్పెడ్‌షీట్స్‌తో  విస్తృతస్థాయి సంబంధిత డాటా బేస్‌తో భర్తీ చేస్తే, అది  నేడు సాధ్యంకాని విశ్లేషణలను సైతం సృష్టించే సామర్థ్యం అందిస్తుంది’’ అని జాన్‌ వెల్లడించారు. ‘‘సైయెంట్‌తో పనిచేయడం వల్ల పరిశ్రమకు మెషీన్‌ లెర్నింగ్‌ను అమలు చేసే అవకాశం కలుగడంతో పాటుగా రేపటి తరపు ఉత్పత్తి అభివృద్ధి రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియ కోసం కృత్రిమ మేథస్సును సైతం వినియోగించే అవకాశం కలుగుతుంది’’ అని అన్నారు.