శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 23 ఫిబ్రవరి 2017 (06:00 IST)

అమెరికాలో అమెరికన్లకు. ఇండియాలో ఇండియన్లకే ప్రాధాన్యమివ్వాలి: మైక్రోసాప్ట్ సీఈఓ

ఉద్యోగాల కల్పన విషయానికొస్తే.. భారత్‌లో భారతీయులకే తొలి ప్రాధాన్యం దక్కాలని, అలాగే అమెరికాలోనూ అదే విధానం ఉండాలని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ళ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇమిగ్రేషన్‌ విధానాలపై వ్యతిరేకత తెలిపిన సత్యనాదెళ

ఉద్యోగాల కల్పన విషయానికొస్తే.. భారత్‌లో భారతీయులకే తొలి ప్రాధాన్యం దక్కాలని, అలాగే అమెరికాలోనూ అదే విధానం ఉండాలని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ళ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇమిగ్రేషన్‌ విధానాలపై వ్యతిరేకత తెలిపిన సత్యనాదెళ్ల.. అమెరికా అంటేనే వలసవాదుల దేశంగా సత్య అభివర్ణించారు. భిన్నత్వానికి అమెరికా ప్రతీకగా నిలుస్తుందని, అత్యుత్తమమైన ఆ దేశ వలసచట్టాలతో ప్రయోజనం పొందినవారిలో తాను కూడా ఒకర్నని ఆయన పేర్కొన్నారు. అయితే ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం ఏ దేశంలో ఆ దేశం పౌరులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది వాణిజ్యం ప్రాధమికి సూత్రమని నాదెళ్ళ వ్యాఖ్యానించారు.
 
తమ కార్యకలాపాలు ఉన్న ప్రతీ దేశంలో ఆర్థిక వృద్ధి అవకాశాలు కల్పించాలన్నదే మైక్రోసాఫ్ట్‌ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ఉదాహరణకు నేనిప్పుడు భారత్‌కి వచ్చినప్పుడు భారత ప్రయోజనాల గురించి మాట్లాడగలగాలి. భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా మేం ఏం చేయగలిగామన్నది చెప్పగలిగి ఉండాలి. అదే విధంగా అమెరికాలో అమెరికాకు తొలి ప్రాధాన్యమివ్వాలి.. బ్రిటన్‌ వెడితే బ్రిటన్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి‘ అని సత్య పేర్కొన్నారు. 
 
అదే సమయంలో భేదం చూపించకుండా అందరికీ సమానఅవకాశాలు కల్పించడం వంటి అమెరికా విలువలను కాపాడటానికి కూడా మైక్రోసాఫ్ట్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు. భారత్‌లో సరైన ఉద్యోగం దొరకపుచ్చుకోవడం గ్రాడ్యుయేట్స్‌కు పెద్ద సవాలుగా ఉంటోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో లింక్డ్‌ఇన్‌లో ’ప్లేస్‌మెంట్స్‌’  పేరిట కొత్తగా మరో సర్వీసును అందుబాటులోకి తెస్తున్నట్లు సత్య వివరించారు. దేశీయంగా కాలేజీ గ్రాడ్యుయేట్స్‌ తమ నైపుణ్యాలకు తగ్గట్లుగా తగిన ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.