శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (13:27 IST)

బంగారం ధరల్లో భారీ మార్పులు.. రూ.300కి పెరిగిన పసిడి ధర

Gold
శుభకార్యాల నేపథ్యంలో పసిడి కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గోల్డ్ రేట్ పైపైకి ఎగబాకుతున్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. శనివారం బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తులం పసిడిపై ఏకంగా రూ.300 పెరిగింది. 
 
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం ధరలు ఇదే విధంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని హస్తినలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,440కి చేరింది. 
 
బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. ఏకంగా కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,200వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,200.