శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (16:32 IST)

దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. అమ్మకాలు ఇక పెరుగుతాయా?

పసిడి, వెండి ధరలు దిగివస్తున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 40వేల రూపాయల దిగువకు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 
 
బుధవారం ఒక్క రోజే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పదిహేనా వందల రూపాయలు తగ్గింది. ఢిల్లీలోని స్పాట్‌ మార్కెట్లో బుధవారం 39 వేల 225 రూపాయలకు పది గ్రాముల మేలిమి బంగారం అమ్ముడుపోయింది. ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో కూడా బంగారం ధర పతనమైంది. 
 
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పతనమౌతోంది. బంగారం ధర నెల రోజుల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. బుధవారం మాత్రమే 8 శాతం మేర పతనమైంది. ఇక గురువారం 2వేల రూపాయల మేర పసిడి ధర తగ్గింది. దీంతో పండుగ వేళ అమ్మకాలు పెరిగే అవకాశం వుందని వ్యాపారులు ఆశిస్తున్నారు.