ఈ బంగారం ధర సిగతరగ... ఇలా పెరిగిపోయిందేంటి?
బంగారం ధర అమాంతం పెరిగింది. డిమాండ్ లేమితో ఈమధ్య కాలంలో కాస్త తగ్గిన పసిడి ధర... ఇప్పుడు మళ్లీ పురోగమనం చెందుతోంది. దేశీయ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.425 పెరిగింది. దీనితో పుత్తడి ధర మళ్లీ రూ. 33 వేల మార్క్‌ను దాటింది. అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలముగా ఉండటం సహా జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం.
సోమవారం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం రూ. 33,215 పలికింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,060కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,530కు చేరుకుంది. మరోవైపు వెండి కూడా నేడు బంగారం బాట పట్టింది. పారిశ్రామిక వర్గాల నుండి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కేజీ వెండి ధర రూ. 170 పెరిగి రూ. 38,670కి చేరింది.