బంగారం ధరలు డౌన్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు
బంగారం ధరలు కాస్త తగ్గాయి. మూడు రోజుల్లో రెండో సారి పసిడి ధరలు తగ్గిపోయాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
మంగళవారం (నవంబర్ 07) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,470గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 170 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.200 మేర పెరిగి.. 75,200 లకు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,470 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470గా ఉంది.