శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (11:15 IST)

షార్ట్ డిస్టన్స్.. అనవసర ప్రయాణాల కోసం రైల్వే ఛార్జీలు పెంచేశాం..

అనవసర ప్రయాణాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో .. రైలు చార్జీలను పరిమితంగా పెంచామని రైల్వే శాఖ ప్రకటించింది. తక్కువ దూరాల ప్రయాణాలను లక్ష్యంగా చేసుకొని భారీగా ఛార్జీలను అంటే రెట్టింపు చేశారు. అమృత్‌సర్‌ నుండి పఠాన్‌కోట్‌ (107 కిలోమీటర్లు) వెళ్లడానికి సెకండ్‌ సీటింగ్‌ రిజర్వ్‌డ్‌ టికెట్‌ ధరను రూ.25 నుంచి రూ.55కు పెంచారు. 
 
అలాగే, జలంధర్‌ సిటీ నుంచి ఫిరోజ్‌పూర్‌కు (118 కిలోమీటర్లు) రూ.30గా ఉన్న పాసింజర్‌ డిఎంయు రైల్వే చార్జీని రూ.60కి పెంచేశారు. దేశంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో.. అనవసర ప్రయాణాలను అడ్డుకునేందుకే చార్జీలను పెంచామని రైల్వే శాఖ వెల్లడించింది. 
 
మరోవైపు ఎక్కువ దూరాలకు ప్రయాణించే రైలు టికెట్లపైనా రూ. 10 నుండి 30 అదనంగా వసూలు చేస్తున్నారు. పరిమితంగానే అని పేర్కొంటున్నప్పటికీ ధరలను భారీగానే పెంచినట్లు తెలుస్తోంది.