BS-6 ప్రమాణాలతో విడుదలైన హోండా సీడీ 110 డ్రీమ్ బైక్, ధర ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా 1966 నుంచి లక్షలాది మంది కస్టమర్‌లను కలిగి ఉన్న ప్రముఖ ద్విచక్రవాహన తయారీదారు సంస్థ అయిన హోండా సంస్థ నుండి బీఎస్-6 ప్రమాణాలతో సరికొత్త బైక్ మోడల్ మార్కెట్లోకి విడుదలైంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) సీడీ 110 డ్రీమ్ బైక్‌ను విడుదల చేసింది.
ఈ బైక్‌ను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. బైక్ ప్రారంభ ధరను రూ. 62,729గా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించారు. ఈ బైక్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఈ కొత్త బైక్‌లో ఇంజిన్ స్టార్ట్/స్టాప్, పొడవాటి సీట్, 110 సీసీ కెపాసిటీ ఇంజిన్, ట్యూబ్‌లెస్ టైర్‌లు వంటి అదనపు ఫీచర్‌లను పొందుపరిచినట్లు ఆ సంస్థ పేర్కొంది.