బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (17:24 IST)

ఖాతాదారులకు ఐసీఐసీఐ షాక్.. భారీగా వడ్డన.. నెలలో 4 సార్లే ఉచితం...

దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు తన ఖాతాదారులకు తేరుకోలేని షాకివ్వనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి భారీగా చార్జీలను వడ్డించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు బ్యాంకు ఆన్‌లైన్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. 
 
నూతన నిర్ణయం వల్ల సేవింగ్ ఖాతాల నగదు లావాదేవీలపై ప్రభావం చూపనుంది. రోజువారీ నగదు డిపాజిట్, విత్ డ్రా, ఇతర లావాదేవీలపై ఈ చార్జీల వర్తింపు ఉంటుందని, తాము విధించిన పరిమితికి మించి జరిపే లావాదేవీలపై అదనంగా రుసుము వసూలు చేయడం జరుగుతుందని బ్యాంకు పేర్కొంది.
 
ఈ కొత్త నిబంధనల మేరకు.. నెలకు 4 సార్లు నగదు లావాదేవాలు ఉచితంగా చేసుకోవచ్చు. అంతకుమించితే 150 రూపాయలు వసూలు చేయనుంది. అలాగే, తమ ఖాతా ఉన్న బ్రాంచి నుంచి 2 లక్షల రూపాయల వరకూ ఉచితంగా లావాదేవీలు (డిపాజిట్ లేక విత్ డ్రా) చేసుకోవచ్చు. ఇది మాత్రం ఖాతాదారులకు కొంత ఊరట కలిగించనుంది. 
 
అలాగే రోజువారీ జరిపే లావాదేవీల్లో భాగంగా రూ.25 వేల వరకు ఉచిత పరిమితిని ప్రకటించింది. అంతకు మించితే వెయ్యి రూపాయలకు గాను రూ.5 లేదా కనీసం రూ.150 ఛార్జీ వడ్డన ఉంటుంది. మూడో పార్టీ లావాదేవీల సవరణలో భాగంగా రూ.25 వేల ట్రాన్సాక్షన్‌కు రూ.150 రూపాయలను రుసుంను వసూలు చేయాలని, రూ.25 వేలకు మించిన థర్డ్ పార్టీ లావాదేవీలపై నిషేధం విధించినట్లు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.