ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 అక్టోబరు 2024 (18:36 IST)

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్

ICICI Prudential Life
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ Q1-FY2025కి 99.35% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని ప్రకటించింది, ఇది దేశంలోని అన్ని జీవిత బీమా కంపెనీలలో అత్యధికం. ముఖ్యంగా, సగటు క్లెయిమ్ సెటిల్‌మెంట్ టర్నరౌండ్ సమయం కేవలం 1.2 రోజులుగా వుంది. అలాగే, ఈ కాలంలో కంపెనీ సెటిల్ చేసిన డెత్ క్లెయిమ్‌ల మొత్తం విలువ రూ. 381.24 కోట్లు.
 
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్ సర్వీస్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ శ్రీ అమిష్ బ్యాంకర్ మాట్లాడుతూ, “లైఫ్ ఇన్సూరెన్స్ అనేది సంపాదిస్తున్న సభ్యుడు లోకాన్ని వదిలి పోయినప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించే ఉత్పత్తి. అందువల్ల, మేము ప్రతి క్లెయిమ్‌ను అత్యంత జాగ్రత్తగా, వేగంగా ప్రాసెస్ చేస్తాము. Q1-FY2025కి సంబంధించి మేము వ్యక్తిగత డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి 99.35%ని కలిగి ఉన్నాము మరియు నాన్-ఇన్వెస్టిగేటివ్ డెత్ క్లెయిమ్‌ను సెటిల్‌మెంట్ చేయడానికి తీసుకున్న సగటు సమయం కేవలం 1.2 రోజులు. పరిశ్రమలో అత్యుత్తమమైన వాటిలో కూడా మా క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో అత్యుత్తమమైనదని మేము విశ్వసిస్తున్నాము. ఇదే కాలానికి, మేము మొత్తమ్మీద రూ. 381.24 కోట్లు సెటిల్ చేశాము. 
 
పరిశ్రమలో అత్యుత్తమ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని స్థిరంగా కలిగి ఉన్న చరిత్ర మాకు ఉంది. ఉదాహరణకు, Q1-FY2024లో ఇది 97.94%, Q2-FY2024లో ఇది 98.14%, Q3-FY2024లో ఇది 98.52% మరియు FY2024లో ఇది 99.17% గా వుంది. మా ‘క్లెయిమ్ ఫర్ ష్యూర్’ సర్వీస్ కార్యక్రమం, అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లను సమర్పించిన తర్వాత, అర్హత ఉన్న అన్ని డెత్ క్లెయిమ్‌లను ఒకే రోజులో పరిష్కరిస్తామని హామీ ఇస్తుంది. ప్రత్యేకంగా, ఈ కార్యక్రమం కింద మేము రూ. Q1-FY2025లో 68.74 కోట్లు సెటిల్ చేశాము. 
 
మా కార్యకలాపాలలో అందుబాటులోకి తీసుకువచ్చిన సాంకేతిక పరిష్కారాలు, క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించడంలో మాకు సహాయపడుతున్నాయి. వీటితో పాటుగా వాట్సాప్, మొబైల్ యాప్, వెబ్ సైట్ వంటి టచ్‌పాయింట్‌లను అందుబాటులోకి తీసుకురావటం వల్ల   క్లెయిమ్‌లను నమోదు చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి తగిన సౌకర్యం అందిస్తున్నాము. జీవిత బీమా అనేది మా పాలసీ హోల్డర్‌లకు, వారు బౌతికంగా లేనప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత అందిస్తామని మేము వారికి చేసే వాగ్దానం" అని అన్నారు.