సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 26 మే 2024 (18:18 IST)

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి తొలి యులిప్ ఐసీఐసీఐ ప్రు ప్లాటినం

cash notes
డిస్ట్రిబ్యూటర్లకు వారి కస్టమర్ల ఫండ్ వేల్యూ ఆధారంగా చెల్లింపులు జరిపే విధానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తమ తొలి యూనిట్ లింక్డ్ ప్రోడక్ట్ అయిన ఐసీఐసీఐ ప్రూ ప్లాటినంను ఆవిష్కరించింది. ఈ విధానంలో డిస్ట్రిబ్యూటర్లకు వారి కస్టమర్ల అసెట్స్‌ను బట్టి (నిర్వహణలో ఉన్న అసెట్స్) కమీషన్లు చెల్లించబడతాయి. పాలసీ వ్యవధి ఆసాంతం పెట్టుబడులను కొనసాగించే విధంగా కస్టమర్లను ప్రోత్సహించేలా డిస్ట్రిబ్యూటర్లకు ఈ విశిష్టమైన ఉత్పత్తి ప్రోత్సాహకాలు అందిస్తుంది. అలాగే దీర్ఘకాలంలో సంపదను పెంచుకునేందుకు వ్యయాలు, పన్నులపరంగా ఇది కస్టమర్లకు అనువైన మార్గంగా ఉంటుంది.
 
ఎటువంటి వ్యయాలు లేదా పన్నులపరమైన భారాలు లేకుండా కస్టమర్లు వివిధ అసెట్ క్లాస్‌లకు ఉచితంగా ఎన్నిసార్లయినా మారే సౌలభ్యాన్ని ఐసీఐసీఐ ప్రూ ప్లాటినం అందిస్తోంది. ఈ ప్రోడక్ట్ కింద కస్టమర్లు 21 ఫండ్స్‌ నుంచి దేన్నయినా ఎంచుకోవచ్చు. వీటిలో ఈక్విటీకి సంబంధించి 13, డెట్ మరియు బ్యాలెన్స్‌డ్ కేటగిరీల్లో చెరి నాలుగు ఫండ్స్ ఉన్నాయి. అలాగే నాలుగు పోర్ట్‌ఫోలియో వ్యూహాల ఆప్షన్లు ఉన్నాయి.
 
“డిస్ట్రిబ్యూటర్లకు వారి కస్టమర్ల ఫండ్ విలువను బట్టి చెల్లింపులు జరిపే విధంగా రూపొందించిన ఐసీఐసీఐ ప్రూ ప్లాటినం ప్రోడక్టు అనేది, ఈ తరహాలో మా కంపెనీ అందిస్తున్న తొలి యూనిట్-లింక్డ్ ప్రోడక్టు. ఇది ఇరువర్గాలకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూర్చగలదు. మేము నిరంతరంగా సరళతరమైన, వినూత్నమైన ప్రోడక్టులు, ప్రక్రియలను రూపొందించేందుకు కృషి చేస్తుంటాం. సరైన మాధ్యమం ద్వారా సరైన ధరకు సరైన కస్టమరుకు సరైన ఉత్పత్తిని అందించాలన్నది మా లక్ష్యం. ఇందులో భాగంగా మేము యాన్యుటీ, పెన్షన్ సేవింగ్స్ ప్లాట్‌ఫాంపై పలు విశిష్టమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. కొనుగోలు తేదీ నుంచి కట్టిన ప్రీమియంలు అన్నీ కూడా 100 శాతం రీఫండ్ చేసే విధమైన యాన్యుటీ ప్రోడక్టు కూడా వీటిలో ఉంది. కస్టమర్లు తమ అవసరాల నిమిత్తం పాక్షికంగా విత్‌డ్రా చేసుకునేందుకు కూడా వీలు కల్పించే సాంప్రదాయ పాలసీని కూడా ఆఫర్ చేస్తున్నాం.
 
డిస్ట్రిబ్యూటర్లకు అదే రోజున పేఅవుట్ కమీషన్లను చెల్లించే ఏకైక జీవిత బీమా సంస్థ కూడా మాదే కావడం గమనార్హం. 2024 ఆర్థిక సంవత్సరంలో మా సేవింగ్స్ పాలసీల్లో సుమారు 45 శాతం పాలసీలను అదే రోజున జారీ చేసిన మైలురాయిని కూడా సాధించాం. జీవిత బీమాకు సంబంధించి క్లెయిమ్‌లు చాలా కీలకమైన అంశం. కస్టమర్లకు స్నేహపూర్వకమైన సంస్థగా మేము అన్ని క్లెయిమ్‌లను అత్యంత వేగంగా సెటిల్ చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 2024 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.3 రోజుల సగటు టర్నెరౌండ్ సమయంతో  పరిశ్రమలోనే అత్యుత్తమ స్థాయిలో 99.2% క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి సాధించడం దీనికి నిదర్శనం” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ శ్రీ అమిత్ పల్టా తెలిపారు.
 
ఐసీఐసీఐ ప్రూ ప్లాటినం రెండు లైఫ్ కవర్ వేరియంట్స్‌ను అందిస్తోంది. గ్రోత్ ప్లస్ వేరియంట్ కింద నామినీకి సమ్ అష్యూర్డ్ లేదా ఫండ్ వేల్యూ, రెండింటిలో ఏది ఎక్కువైతే అది లభిస్తుంది. ఇక ప్రొటెక్ట్ ప్లస్ వేరియంట్ కింద నామినీకి సమ్ అష్యూర్డ్ అలాగే ఫండ్ వేల్యూ కూడా లభిస్తుంది.