2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..
2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈసారి బాలీవుడ్ తారలే కాకుండా దక్షిణాది హీరోయిన్లు కూడా మెరిశారు. ఈ సంవత్సరం, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి శోభితా ధూళిపాళ మెరిసింది. కేన్స్ రెడ్ కార్పెట్‌ను అలంకరించిన మొదటి తెలుగు నటిగా నిలిచింది.
పర్పుల్ గౌనులో ఆమె లుక్ వావ్ అనేలా వుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఐశ్వర్య రాయ్, కియారా అద్వానీ లేదా ఊర్వశి రౌతేలా వంటి తారలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసేవారు. కానీ ఈసారి కేన్స్‌లో శోభిత గ్లామరస్ ప్రెజెన్స్ తెలుగు వారికి నిజమైన హైలైట్ ఇచ్చింది.
శోభిత ఇటీవల ఆంగ్ల చిత్రం "మంకీ మ్యాన్"లో కనిపించింది. ఇంకా రాబోయే హిందీ ప్రాజెక్ట్ "సితార" కోసం సిద్ధమవుతోంది. అలాగే ఆమె త్వరలో రెండు తెలుగు సినిమాల్లో కూడా కనిపించనుంది.