"మంకీ మ్యాన్"తో నటించడం హ్యాపీ.. హాలీవుడ్ ఎంట్రీపై తెలుగమ్మాయి
ఎన్ని సినిమాల్లో నటించినా సినిమా తారలకు హాలీవుడ్‌లో ఛాన్స్ వస్తే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. తాజాగా తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ళ హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. తాజాగా హాలీవుడ్ చిత్రం "మంకీ మ్యాన్"లో అవకాశం రావడంతో అలాంటి ఆనందాన్ని పొందింది.
అంతేకాదు "స్లమ్ డాగ్ మిలియనీర్" ఫేమ్ నటుడు దేవ్ పటేల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ఇటీవల అమెరికాలోని ఆస్టిన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "ఎస్ఎక్స్‌డబ్ల్యూ" (సౌత్ బై సౌత్‌వెస్ట్)లో ప్రదర్శించబడింది.
ప్రీమియర్‌కు హాజరైన శోభితా ధూళిపాళ మాట్లాడుతూ -"వరల్డ్ ప్రీమియర్‌లో మా చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులు కేకలు వేసి చప్పట్లు కొట్టారు. స్టాండింగ్ ఒవేషన్‌తో ప్రశంసించారు. దర్శకుడిగా దేవ్ పటేల్‌కి ఇది మొదటి సినిమా. హాలీవుడ్‌లో ఇది నా మొదటి సినిమా.
ఈ సినిమాలో నాకు పెద్దగా పాత్ర లేకపోయినా, వేరే భాషలో నటించడం, దేవ్ పటేల్ దృష్టిలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక విపిన్ శర్మ, అశ్విని కల్శేఖర్, మకరంద్ దేశ్ పాండే వంటి భారతీయ తారలతో పాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ నటించిన "మంకీ మ్యాన్" ఏప్రిల్ 5న విడుదల కానుంది.