ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (09:58 IST)

విమాన ప్రమాదం: ఇద్దరు కుమార్తెలతో కలిసి హాలీవుడ్ నటుడి మృతి

flight
కరీబియన్ సముద్రంలో విమానం కూలిన ఘటనలో హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ మృతి చెందారు.  తన ఇద్దరు కూతుళ్లతో ఓలివర్ ప్రాణాలు విడిచారు. విహార యాత్ర కోసం ఓలివర్.. బెకియా నుంచి బయలుదేరాక ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ చేసిన కొద్ది సేపటికే విమానం సముద్రంలో కూలిపోయింది. 
 
ఈ ఘోర ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే విమానం కూలిన ప్రాంతానికి చేరుకున్న జాలరులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో విమానం పైలట్ కూడా కన్నుమూశారు.
 
జర్మనీ సంతతికి చెందిన ఓలివర్ తన కెరీర్‌లో 60కి పైగా సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. ప్రముఖ నటుడు టామ్ క్రూయిజ్ నటించిన వాల్కరీ మూవీలోనూ ఓ చిన్న పాత్ర పోషించారు.