గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (11:38 IST)

చైతూతో రెండో పెళ్లి.. శోభిత ధూళిపాళ్లతో డుం. డుం. డుం?

Nagachaitanya_Shobitha
Nagachaitanya_Shobitha
టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త  కొద్దికాలంగా ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్ని నెలలుగా శోభిత ధూళిపాళ్లతో చైతూ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
వీరిద్దరూ కలిసి ఉన్న అనేక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వ్యాపారవేత్త కుమార్తెను నాగచైతన్య రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ ఇటీవలి కాలంలో మీడియాలో వార్తలొచ్చాయి. 
 
త్వరలోనే వారి రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ప్రకటించే విషయమై వారు చర్చించారు. వారి ప్రేమ వ్యవహారాన్ని బహిరంగంగా అంగీకరించేందుకు వారు సిగ్గు పడటం లేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది.