బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (19:27 IST)

సమంత ఇన్‌స్టాలో పెళ్లి ఫోటో ప్రత్యక్షం: ప్లీజ్ మళ్లీ కలిసిపోండి సామ్-చై

Nagachaitanya, Samantha
సమంత-నాగచైతన్య కొన్ని కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ఈ జంట విడిపోవడాన్ని వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సందర్భంగా వచ్చినప్పుడల్లా ఇరువురూ కలిసి జీవితం సాగించాలని కోరుకుంటున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... సమంత ప్రస్తుతం ఖుషీ హిట్‌తో సంతోషంగా వుంది. ఐతే ఆమె ఇన్‌స్టాగ్రాం పేజీలో నాగచైతన్యతో క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోలను సమంత అప్పట్లో ఆర్కైవ్ లో పెట్టిందని టాక్ కూడా వినిపించింది. ప్రస్తుతం అందులో నుంచి దాన్ని బయటకు తీసేయడంతో అది పేజీలో కనబడుతోంది.
 
ఈ ఫోటోను చూసిన ఆమె అభిమానులు... నాగచైతన్యతో కలిసి తిరిగి కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఇద్దరూ చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనీ, దాన్ని తాము చూడాలని కోరుకుంటున్నట్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ ఫోటో విషయం సమంత దృష్టికి వచ్చిదో లేదో మరి.