గురువారం, 18 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (18:51 IST)

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్యారా తెలుగులో రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి చిత్రం

Rakshit Shetty, Rukmini Vasant
Rakshit Shetty, Rukmini Vasant
టాలీవుడ్  అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  ఓ వైపు స్టార్ హీరోలతో వరుస చిత్రాలు నిర్మిస్తూనే, మరోవైపు పలు డబ్బింగ్ చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. తాజాగా కన్నడ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం  ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించింది. 
 
ఈ మూవీ సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రానికి  ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్‌ని అనౌన్స్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సెప్టెంబర్ 22న ఈ మూవీని తెలుగులో  రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో రక్షిత్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.  కన్నడలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ  చిత్రం తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని తెలియజేశారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.