ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జులై 2021 (15:07 IST)

గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలా? ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్

దేశంలో గ్యాస్ సిలిండర్ ధర అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.900గా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా గ్యాస్ సిలిండర్‌ను బుకింగ్ చేసుకోవాలని అనుకునే వాళ్లకు ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్‌ను బుకింగ్ చేసుకోవడం ద్వారా అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్‌ను పొందవచ్చు.
 
అయితే జులై 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండటంతో ఐసీఐసీఐ ఐ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గ్యాస్ సిలిండర్ చెల్లింపుతో పాటు ఇతర బిల్లుల చెల్లింపు చేయడం ద్వారా ఈ ఆఫర్‌కు అర్హత పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. అయితే ఈ వోచర్‌ను పొందాలని అనుకుంటే కొన్ని షరతులు ఉన్నాయి. ప్రతిరోజు మూడు బిల్లులు చెల్లించే వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
 
ఈ నెల చివరి వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండటంతో పాటు ఒక కస్టమర్ గరిష్టంగా ఒక వోచర్‌ను పొందే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మూడు బిల్లులను చెల్లించే తొలి 300 మంది మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. దేశంలో కోట్ల సంఖ్యలో గ్యాస్ వినియోగదారులు ఉండగా ఈ ఆఫర్ వల్ల కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
 
ఈ ఆఫర్ తో పాటు పలు ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థలు కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై కొన్ని ఆఫర్లను ప్రకటించాయి. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. పువ్వులు చూడటానికి అందంగా ఉండటం కంటే లోతైన అర్ధాన్ని కలిగి ఉంటాయి. పువ్వులు ప్రేమ, అదృష్టం, ఆనందం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నం. ఒక స్త్రీ తన జుట్టు మీద పువ్వు ధరించినప్పుడు, అది తన ఇంటికి ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు.