సోమవారం, 16 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2024 (10:10 IST)

భారత్‌లో జోరుగా డిజిటల్ చెల్లింపులు.. గణాంకాలు ఇవిగో...

digital payments
దేశంలో డిజిటల్ (యూపీఏ) చెల్లింపులు జోరుగా జరుగుతున్నాయి. దేశంలో యూపీఏ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డు అయింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఎక్స్ వేదికగా ఈ యేడాది జరిగిన డిజిటల్ లావాదీవీలను వెల్లడించింది. ఈ యేడాది జనవరి నుంచి నంబరు నెలాఖరు వరకూ రూ.15547 కోట్ల లావీదేవీలు జరగ్గా, రూ.223 లక్షలు కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపింది. 
 
భారత్ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా ప్రయాణిస్తుదని పేర్కొంది. ఇది భారత్ పరివర్తనపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా యూపీఏ పేమెంట్స్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నదని పేర్కొంటూ #FinMinYearReview 2024 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది.