సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మార్చి 2024 (17:39 IST)

పోస్టాఫీస్ పెట్టుబడి పెడుతున్నారా? రూ.1.50 లక్షలు ఆదా.. ఎలా?

Indian Post
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి పన్నును తగ్గించుకోవడానికి పెట్టుబడిదారులకు గొప్ప అవకాశం. వివిధ పెట్టుబడులపై దీని కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షలు ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలలోని పోస్టాఫీసు పథకాల్లో ఈ ప్రయోజనాలు లభిస్తాయని చెప్పవచ్చు. 
 
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మూడు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. అంటే పెట్టుబడి, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీపై వచ్చే రాబడులపై పన్ను తగ్గించే వెసులుబాటు ఉంది. అలాగే, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ మొదలైన వాటిపై పన్నును భారీగా తగ్గించుకునే వెసులుబాటు ఉంది.
 
అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్ని పోస్టాఫీసు పథకాలకు పన్ను ప్రయోజనాలు ఉండవు. వీటిలో కిసాన్ వికాస్ పత్ర, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తాయి. కానీ పన్ను తగ్గించలేము. అందుకే డిపాజిటర్లు గుర్తుంచుకోవాలి. ఈ పథకాలను ఒకసారి చూద్దాం.
 
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం..
ఇందులో, వ్యక్తులు గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ ఖాతా కింద రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పెట్టుబడి రూ. 1500 చెల్లిస్తే సరిపోతుంది. వడ్డీ రేటు 7.40 శాతం అయితే, పన్ను ప్రయోజనం లేదు. వడ్డీ ఆదాయంపై కూడా టీడీఎస్ వర్తిస్తుంది. 
 
కిసాన్ వికాస్ పత్ర పథకంలో పన్ను ప్రయోజనాలు కూడా అందుబాటులో లేవు. రిటర్న్‌లపై కూడా పన్ను వర్తిస్తుంది. వడ్డీ రేటు 7.50 శాతం కాగా, పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. కనీసం రూ. 1000 డిపాజిట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు.
 
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్
ఇది మహిళలకు మాత్రమే ఉద్దేశించిన పథకం. దీనికి స్థిర వడ్డీ రేటు 7.5 శాతం. ఏ వయసు స్త్రీ అయినా ఇందులో చేరవచ్చు. ఈ పథకం రెండేళ్ల కాలవ్యవధి ఉంటుంది. ఇక్కడ కూడా రాబడి వడ్డీపై పన్ను విధించబడుతుంది. టీడీఎస్ కూడా ఉంటుంది.
 
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాకు కూడా పన్ను ప్రయోజనాలు లేవు. ఇక్కడ వడ్డీ రేట్లు ఏడాది కాలవ్యవధికి 6.9 శాతం, రెండేళ్ల కాలపరిమితికి 7 శాతం, మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు 7.10 శాతం, ఐదేళ్ల కాలానికి 7.5 శాతం. మిగతా వాటికి పన్ను విధిస్తారు.