శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (07:34 IST)

జస్ట్ 4 నెలల్లోనే రూ.240 కోట్ల ఆస్తిపరుడు.. ఎవరీ యంగ్ మిలియనీర్?

infosys
ఆ పిల్లోడి వయసు కేవలం నాలుగు నెలలు మాత్రమే. కానీ, ఆ బుడ్డోడు ఇపుడు ఏకంగా రూ.240 కోట్ల ఆస్తికి వారసుడు. అతని పేరు ఏకగ్రహ్ రోహన్ మూర్తి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సుధామూర్తిల మనవడు. తన మనవడైన ఏకగ్రహ్ రోహన్ మూర్తికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు. దీంతో కేవలం నాలుగు నెలల వయసులో దేశంలోనే అత్యంత పిన్నవయస్కుడైన మిలియనీర్‌గా అవతరించాడు. ఈ మేరకు బాంబే స్టాక్ మార్కెట్‌లో సోమవారం లిస్టింగ్ చేశారు. 
 
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ ఉంది. ఈ కంపెనీలో నారాయణ మూర్తికి 0.40 శాతం వాటా వుంది. ఇందులో నుంచి 0.04 శాతం వాటాను (15 లక్షల షేర్లు) తన మనవడైన ఏకగ్రహ్ రోహన్ మూర్తిగా బహుమతిగా ఇచ్చారు. ఆఫ్ మార్కెట్ విధానంలో ఈ షేర్ల బదిలీ ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వాటా కూడా 0.36 శాతానికి తగ్గింది. అయినప్పటికీ ఆయన చేతిలో ఇంకా 1.51 కోట్ల షేర్లు ఉన్నాయి. కాగా, రోహన్ మూర్తి.. గత 2019లో అపర్ణ కృష్ణన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల కుమారుడే రోహన్ మూర్తి. నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తి... లండన్‌లో రిషి సునాక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం రిషి సునాక్ ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నారు. 
 
కాగా, నారాయణమూర్తి తన భార్య అయిన సుధామూర్తి వద్ద 250 డాలర్లు అంటే సుమారుగా 20 వేల రూపాయలు తీసుకుని 1981లో ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించారు. దానిని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ, ప్రస్తుతం దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా తీర్చిదిద్దారు. ఇలా 25 ఏళ్లు ఆహోరాత్రాలు కష్టపడి పనిచేసిన నారాయణమూర్తి 2021 డిసెంబర్​లో రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి తన ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా (చారిటీ) స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన సతీమణి సుధామూర్తి ఇటీవలే రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. 
 
ఆ రెండు దేశాల మధ్య యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధమే.. పుతిన్ హెచ్చరిక
 
నాటో దళాలు, రష్యా దళాల మధ్య యుద్ధమంటూ జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. అయితే, ఈ పరిణామాన్ని ఏ ఒక్కరూ లేదా ఏ ఒక్క దేశం కోరుకోదని ఆయన అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన మరోమారు ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అమెరికా నేతృత్వంలోని నాటో మిలిటరీ కూటమి, రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం అంచున నిలుస్తుందన్నారు. 
 
రష్యా, నాటో దళాల మధ్య యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని, అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం అడుగుదూరంలో ఉంటుందని పశ్చిమ దేశాలను ఆయన సోమవారం హెచ్చరించారు. నాటో దళాలు, రష్యా మధ్య యుద్ధం ముప్పు పొంచివుందంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ వ్యాఖ్యానించారంటూ పుతిన్ వద్ద మీడియా ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధునిక ప్రపంచంలో అన్నీ సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని తాను భావిస్తున్నానని పుతిన్ అన్నారు. 
 
రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో ఇప్పటికే నాటో సైనిక సిబ్బంది ఉన్నప్పటికీ.. యుద్ధంపై చర్చించేందుకు ఫ్రాన్స్, ఇంగ్లండ్లను ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం తమకు లేదని, అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదని పుతిన్ చెప్పారు. కాగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు, రష్యా మధ్య సంబంధాలు అథమ స్థాయికి సన్నగిల్లిన విషయం తెల్సిందే.