ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 అక్టోబరు 2022 (17:23 IST)

దేశంలో ‘బోర్న్‌ ఈవీ స్టార్టప్‌’గా రెండవ ర్యాంక్‌ సాధించిన ప్యూర్‌ ఈవీ

Yellow EV
అత్యంత కీలకమైన 100కు పైగా మేధోసంపత్తి హక్కుల కోసం దరఖాస్తు చేయడం ద్వారా ప్యూర్‌ ఈవీ అత్యంత కీలకమైన మైలురాయిని చేరుకుంది. ఈ కంపెనీ ఇప్పుడు బోర్న్‌ ఈవీ స్టార్టప్స్‌ విభాగంలో అగ్రగామి సంస్ధగా నిలిచింది. పరిశోధనా లక్ష్యిత తమ సంస్కృతి గురించి ప్యూర్‌ ఈవీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీ రోహిత్‌ వదేరా మాట్లాడుతూ, ప్యూర్‌ ఈవీ ఆర్ అండ్ డి ప్రోగ్రామ్‌ పవర్‌ట్రైన్‌ డిజైన్‌లో అత్యంత కీలకమైన సాంకేతిక అభివృద్ధి పై దృష్టి సారించింది అని తెలిపారు. తుది వినియోగదారులకు ఆహ్లాదకరమైన అనుభవాలను అందించేందుకు ఇది మాకు తోడ్పడుతుంది. మేము అత్యంత బలమైన ఆర్‌ అండ్‌ డీ బృందంను అభివృద్ధి చేశాము.

 
వీరిలో 100 మందికి పైగా ఇంజినీర్లు, థర్మల్‌ మేనేజ్‌మెంట్‌, ఎంబీడెడ్‌ సిస్టమ్స్‌, పవర్‌ ఎలకా్ట్రనిక్స్‌, రవాణా, ప్రొడక్ట్‌ డిజైన్‌, ఎలక్ట్రో- కెమిస్ట్రీ వంటి అంశాలలో అర్హత కలిగిన వారు. తొలి దశ స్వీకరణ దశ నుంచి అత్యంత వేగంగా ఈవీ పరిశ్రమ ఇప్పుడు వృద్ధి చెందుతుంది. విస్తృత స్ధాయిలో వాస్తవ ప్రపంచపు ట్రయల్స్‌ మరియు  పరీక్షా ప్రక్రియలు ఇప్పుడు పనితీరు ధృవీకరణ కోసం అత్యవసరం. మేము విస్తృతస్ధాయిలో ఆర్‌ అండ్‌ డీ సదుపాయాలు ఏర్పాటుచేయడంతో పాటుగా మా పరిశోధనా కేంద్రం వద్ద ఈ కారణం కోసం పరీక్షా సదుపాయాలను సైతం ఏర్పరిచాము. అంతేకాదు రాబోయే 18 నెలల్లో మరో 200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నాము’’ అని అన్నారు.

 
ఈ కంపెనీ ఉత్పత్తి పొర్ట్‌ఫోలియోలో రెండు స్కూటర్లు EPluto 7G, ETrance NEO, హై పెర్‌ఫార్మెన్స్‌ మోటర్‌సైకిల్‌ eTryst 350 ఉన్నాయి. మరో మోటర్‌సైకిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ కంపెనీ ఒక లక్ష చదరపు అడుగుల ఫ్యాక్టరీని తెలంగాణాలో ప్రారంభించింది. దీనిలో వాహన, బ్యాటరీ తయారీ విభాగాలు ఉన్నాయి. ఈ కంపెనీ దీనిని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంకు విస్తరించడానికి ప్రణాళిక చేశారు. తద్వారా వార్షిక వాహన ఉత్పత్తి సామర్ధ్యం 1,20,000 యూనిట్లకు చేరనుంది. అలాగే వార్షిక బ్యాటరీ ఉత్పత్తి సామర్ధ్యం 0.5 గిగావాట్‌ హవర్‌కు చేరనుంది. ఇది 2023 ఆర్ధిక సంవత్సరాంతానికి సిద్ధం కాగలదు.