గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2025 (11:38 IST)

Vande Bharat Sleeper: గంటకు 180 కి.మీ వేగం- వందే భారత్‌ స్లీపర్‌ ట్రయల్ రన్- గ్లాసులో చుక్క నీరు? (video)

Vande Bharat Sleeper Express
Vande Bharat Sleeper Express
రాజస్థాన్‌లోని కోటా నుంచి లబాన్‌ స్టేషన్ల మధ్య 180 కి.మీ/గంట వేగంతో వందేభారత్ రైలు దూసుకెళ్లింది. వందే భారత్‌ స్లీపర్‌ రైలు 180 కి.మీ/గంట వేగంతో రయ్‌రయ్‌మంటూ పరుగులు పెట్టింది. ఆ సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును రైలులో ఉంచారు. 
 
విభిన్నమైన ట్రాక్‌ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సూచనల మేరకు రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్‌ కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. 
 
అందులో వందే భారత్‌ స్లీపర్‌ రైలు 180 కి.మీ/గంట వేగంతో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లింది. అంత వేగంలోనూ రైలులో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Water in Glass
Water in Glass
 
మరికొన్ని నెలల్లో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. ఈ స్లీపర్ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారు. వందే భారత్‌ స్లీపర్ రైలులో సీటింగ్‌తో పాటు లగేజీ(ఎస్​ఎల్​ఆర్​) కోసం 2 బోగీలు అందుబాటులో ఉంటాయి.