ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 10 జూన్ 2020 (19:36 IST)

చెన్నై కరోనావైరస్ బాధితులకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు

చెన్నైలో రోజురోజుకీ కరోనావైరస్ వ్యాప్తి అధికమవుతుండటంతో బాధితులను గుర్తించి వారికి వైద్య చికిత్స అందించడం కష్టమవుతోంది. ఈ నేపధ్యంలో వారిని త్వరితగతిన గుర్తించి తగు వైద్య చికిత్సలు అందించడం కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్లను ఇచ్చింది.
 
వీటి ద్వారా సంప్రదిస్తే సత్వర వైద్య సహాయం అందించే వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా బాధితులు తమకు వైద్య చికిత్స కోసం 044-40067108 అనె నెంబరును సంప్రదించాలని, దీని ద్వారా 108 అంబులెన్స్ సహాయం త్వరగా లభిస్తుందని ఆరోగ్యం శాఖమంత్రి విజయభాస్కర్ తెలియజేశారు.