శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (10:48 IST)

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో 9985 కేసులు

చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన కరోనాతో భారతదేశం కూడా హడలిపోతుంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో భారత్‌లో గడిచిన 24 గంటల్లో 9985 మందికి కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం (జూన్ 10,2020) వెల్లడించింది. 
 
వీరిలో 24 గంటల్లోనే 279 మంది కూడా మృతి చెందినట్లు తెలిపింది. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 2 లక్షల 76 వేల 583లకు చేరుకుంది. దీంట్లో 1 లక్షా 33వేల 632 కేసులు యాక్టివ్‌గా ఉండగా..1 లక్షా 35వేల 206 కేసులు రికవర్‌ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అలాగే దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 7,745 వేలుగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. కాగా..కరోనా వైరస్‌ శ్యాంపిల్‌ పరీక్షలు దేశంలో 50 లక్షలు దాటినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో 1 లక్షా 42వేల 216 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించామని తెలిపింది.