సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (12:47 IST)

కరోనా వైరస్.. ఏటీఎంను ముట్టుకోకుండానే డబ్బులు తీసుకోవాలంటే?

ATM
కరోనా వైరస్ విజృంభిస్తోంది. కోవిడ్ కారణంగా బహిరంగ ప్రదేశాల్లో వస్తువులను ముట్టుకునేందుకు జనం జంకుతున్నారు. ముఖ్యంగా ఏటీఎం సెంటర్‌కు వెళ్లి మిషన్‌ను తాకడానికి చాలామంది భయపడిపోతున్నారు. ఎవరెవరో ముట్టుకోవడం వల్ల వైరస్ సోకే అవకాశం ఉందని చాలామంది వెనకా ముందు ఆలోచిస్తున్నారు. 
 
అయితే ఇక నుంచి ఏటీఎం మిషన్‌ను ఏ మాత్రం చేతితో ముట్టుకోకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. గతంలో కంటే సులువుగా కూడా పని పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది.
 
దీని కోసం ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కొత్త రకం మిషన్లను అభివృద్ధి చేస్తున్నాయి. వాటిలో ఉండే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే డబ్బులు తీసుకునే అవకాశం కల్పించనున్నారు. దీని ద్వారా కార్డ్ క్లోనింగ్ అవుతుందన్న భయం కూడా ఉండదు. 
 
అత్యంత సురక్షితమైన మార్గం కావడంతో ఈ విధానం తీసుకురావాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం 25 సెకన్లలోనే డబ్బులు చేతికి వచ్చేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఇవి కనుక వస్తే రాబోయే రోజుల్లో ఏటీఎంలలో ఇంకా సులువుగా డబ్బులు తీసుకునే అవకాశం వుంది.