కరోనా వైరస్: ప్రపంచంలో 6వ స్థానంలో భారత్, చైనాలో డెత్ - 0, భారత్ - 266
భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. దీనితో ప్రపంచంలోని కరోనా వైరస్ బాధిత దేశాలో జాబితాలో భారత్ 6వ స్థానానికి చేరింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో లాక్ డౌన్ విధించారు. దీనిని అదుపుచేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
కానీ కరోనా వైరస్ విస్తరణ మాత్రం ఎంతమాత్రం ఆగడంలేదు. జూన్ నెల నుంచి లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనా వైరస్ కేసులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. జూన్ 5వ తేదీ నాటికి భారతదేశంలో కేసుల సంఖ్య 2,36,657 కాగా ఇందులో 1,14,073 మంది కోలుకున్నారు. 6,642 మంది మరణించారు.
ఇకపోతే కరోనా వైరస్ పుట్టుక కేంద్రమైన చైనాలో ఈరోజు ఒక్క మరణం కూడా సంభవించలేదు. ప్రస్తుతం ఆదేశం 18వ స్థానంలో వున్నది. మన దేశంలో ఈరోజు కరోనా వైరస్ కారణంగా 266 మంది కన్నుమూశారు.