1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 జూన్ 2020 (19:12 IST)

కరోనా వైరస్: బ్రహ్మంగారి లెక్కకి మరో 29 లక్షల తక్కువ, కాలజ్ఞానం నిజమవుతోందా?

కోరంకి యను జబ్బు కోటి మందికి తగిలి కోడిలా గిలగిలా కొట్టుకు పోయేరయా అంటూ వందల ఏళ్ల క్రితం కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పినట్లే కరోనా వైరస్ బాధితుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 71,19,232కి చేరాయి. ఆయన చెప్పిన లెక్కకి మరో 29 లక్షల తక్కువ. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేగాన్ని చూస్తుంటే ఆ సంఖ్యను టచ్ చేయడానికి ఎంతో సమయం పట్టేట్లు కనబడటం లేదు. 
 
ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో విఫలమవుతూనే వస్తున్నాయి. ప్రపంచంలో ఈ వైరస్ 213 దేశాలకు పాకగా మొత్తం 71,19,232 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,06,655 మంది మృత్యువాతపడగా 3,476,246 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.