శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2016 (15:56 IST)

సెల్ఫీల పిచ్చి.. 12వ తరగతి విద్యార్థి.. 120 అడుగుల బావిలో పడ్డాడు.. ఆపై ఏమైంది?

సెల్ఫీల పిచ్చి, వీడియోల పిచ్చి రోజురోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఈ సెల్ఫీల వ‌ల్ల కొన్ని కొన్ని సార్లు కొంత మంది త‌మ ప్రాణాల‌నే కోల్పోతున్నారు. తాజాగా తమిళనాడులో మరో సెల్ఫీ మరణం చోటుచేసుకుంది. కోయంబత్

సెల్ఫీల పిచ్చి, వీడియోల పిచ్చి రోజురోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఈ సెల్ఫీల వ‌ల్ల కొన్ని కొన్ని సార్లు కొంత మంది త‌మ ప్రాణాల‌నే కోల్పోతున్నారు. తాజాగా తమిళనాడులో మరో సెల్ఫీ మరణం చోటుచేసుకుంది. కోయంబత్తూర్‌ సమీపంలోని పీలమేదులో 12వ తరగతి చదువుతున్న హరీష్‌ అనే విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు 120 అడుగుల లోతున్న బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి వెళ్లిన హరీష్‌ బావి అంచున గోడపై నిలబడి బావి లోతు కనిపించేలా సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ కాలు జారి బావిలో పడ్డాడు. స్నేహితుల అరుపులు, కేకలు వినిపించడంతో గ్రామస్థులు పరుగో పరుగున వచ్చారు. బావి లోతు ఎక్కువగా ఉండడంతో ఆ విద్యార్థిని కాపాడలేకపోయారు.
 
గ్రామస్థులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కాని అగ్నిమాపక సిబ్బంది వచ్చి బయటకు తీసేటప్పటికి హరీష్‌ ప్రాణాలు కోల్పోయాడు. 120 అడుగుల లోతున్న బావిలో 60అడుగుల మేర నీరుండడంతో అతడు బయటికి రాలేకపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.