పెళ్లిని అడ్డుకున్న వాట్సాప్ సందేశం...

సోష‌ల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్‌కు ధీటుగా ఎదుగుతున్న వాట్సాప్ ఇప్పుడు పెళ్లికూతురి జీవితానికే ఎసరుపెట్టింది. అంతకుముందే వివాహమైనట్లు వాట్సాప్ ద్వారా తెలియడంతో పెళ్లికుమారుడు వివాహాన్ని రద్దు

బుధవారం, 31 ఆగస్టు 2016 (10:02 IST)
సోష‌ల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్‌కు ధీటుగా ఎదుగుతున్న వాట్సాప్ ఇప్పుడు పెళ్లికూతురి జీవితానికే ఎసరుపెట్టింది. అంతకుముందే  వివాహమైనట్లు వాట్సాప్ ద్వారా తెలియడంతో పెళ్లికుమారుడు వివాహాన్ని రద్దు చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... ఆరణి సమీపంలోని సేవూర్ గ్రామానికి చెందిన మణి కుమారుడు మహేష్ (31). ఇతనికి ఆరణి ఎస్వీనగర్‌కు చెందిన యువతితో సోమవారం రాత్రి సేవూర్‌లోని కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో రిసెప్షన్ జరిగింది.
 
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రిసెప్షన్ జరుగుతున్న సమయంలో ఆరణి దసరాపేటకు చెందిన వినాయకం నుంచి మహేష్ సెల్‌ఫోన్‌కు వాట్సాప్‌లో ఓ సందేశం అందింది. అందులో పెళ్లికూతురు, వినాయకం కలిసి దిగిన ఫొటోలతో పాటు తనకు, యువతికి 8 నెలల క్రితం వివాహం జరిగిందని తెలిపాడు. దీంతో మహేష్‌కు నోటమాట రాలేదు. ఈ విషయాన్ని వెంటనే తన తల్లిదండ్రులకు చెప్పాడు.
 
ఈ విషయంపై ఆగ్రహం చెందిన మహేష్ తల్లిదండ్రులు యువతి తల్లిదండ్రులను నిలదీశారు. అసలు విషయం తెలియడంతో మహేష్ పెళ్లిని రద్దు చేసి పోలీసులను ఆశ్రయించాడు. గతంలో యువతికి వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేశారని... అంతేకాదు వివాహ ఏర్పాట్లకు తనకు రూ.5 లక్షలు ఖర్చు అయ్యిందని దాన్ని తిరిగి యువతి కుటుంబ సభ్యులు చెల్లించాలని కోరారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. 

అన్నీ చూడండి

'పెద్ది'లో చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్‌బ్లోయింగ్‌, ఫ్యామిలీతో కలిసి చూడండి: దర్శకుడు బుచ్చిబాబు సానా

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

తర్వాతి కథనం
Show comments