శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జులై 2020 (10:52 IST)

దేశంలో 8లక్షల మార్కును తాకిన కరోనా వైరస్.. రికవరీ రేటు పెరిగింది..

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,82,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 27,114 పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయి.
 
519 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 8,20,916కు చేరింది. ప్రస్తుతం 2,83,407 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతుండగా.. 5,15,385 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం 22,123 మంది కరోనాతో బాధపడుతూ మరణించారు.
 
ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 4.95 లక్షలకు చేరింది. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 62.09కు చేరిందని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా మరణాల రేటు 2.72కు తగ్గిందని.. గత నెలలో ఇది 2.82 శాతం ఉండేదని కేంద్ర సర్కార్ వివరించింది.