Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

Written By సెల్వి
Updated: శనివారం, 31 మే 2025 (13:02 IST)
Corona
ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం రేపింది. కలెక్టరేటులో పనిచేసే ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో వారు హోం ఐసోలేషన్‌లో వున్నారు. కలెక్టరేట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మిగిలిన సిబ్బందికి నెగెటివ్‌గా వచ్చింది. 
 
కలెక్టరేట్‌లో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో తోటి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం కలెక్టరేట్‌లోని రెండు సెక్షన్ల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 
 
అయితే పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో కరోనా చాప కింద నీరులా పారుతోంది. గత కొన్ని రోజులుగా పదికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో తొలి కరోనా కేసు విశాఖపట్నంలో నమోదు అయ్యింది. విశాఖకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అవడంతో వెంటనే చికిత్స అందేశారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments