సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (09:33 IST)

కొడాలి నాని వంగవీటి రాధాకు కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, జాప్రతినిధులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు.
 
అలాగే కొడాలి నాని మిత్రుడు, తెలుగుదేశం నాయకులు వంగవీటి రాధాకు కూడా కరోనా సోకింది. ఇద్దరూ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు.
 
కాగా వీరిద్దరి మధ్య రాజకీయంగా హాట్ హాట్‌గా విమర్శలు, ప్రతివిమర్శలు నడుస్తుంటాయి. తాజాగా వంగవీటి రాధా హత్యకు రెక్కీ విషయంలోనూ వీరిద్దరి మధ్య వాగ్భాణాలు నడిచాయి. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చర్చనీయాశంగా మారిన సంగతి తెలిసిందే.