Dharma Sangrah

ఏటీఎం నుంచి డబ్బును డ్రా చేస్తున్నారా? కరోనా సోకకుండా ఇలా చేయండి! (video)

Written By మోహన్
Updated: శుక్రవారం, 15 మే 2020 (14:58 IST)
కరోనాతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి నుండి కాపాడుకునేందుకు ప్రజలు ఇప్పటికే పలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అనుకోకుండానే నిత్యం చేసే పనుల వల్ల కూడా కరోనా సోకే ప్రమాదముంది.

సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, శానిటైజర్‌లు వాడటం మొదలైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసేటపుడు మరీ జాగ్రత్త అవసరం. ఎందుకంటే చాలామంది ఏటీఎంల నుంచి డబ్బును విత్‌డ్రా చేస్తారు కాబట్టి, కరోనా సోకకుండా ఏటీఎంలో నగదు ఎలా విత్ డ్రా చేసుకోవాలో ఒకసారి చూద్దాం.
 
* ఏటీఎం తలుపును తీసేటప్పుడు చేతులతో కాకుండా, భుజం లేదా కాలుతో తెరవడం ఉత్తమం.
 
* ఏటీఎంలో ఉన్న ఏ వస్తువునూ నేరుగా తాకకూడదు.
 
* పిన్ నెంబర్ నమోదు చేసేటప్పుడు టిష్యూ పేపర్ వాడటం మంచిది.
 
* ఏటీఎం నుంచి వచ్చిన నగదును నేరుగా జేబుల్లో పెట్టుకోకూడదు. శానిటైజ్ చేసిన తర్వాతే మాత్రమే జేబులో పెట్టుకోవాలి.
 
* ఏటీఎం కార్డును ఉపయోగించే ముందు, అలాగే ఆ తర్వాత కూడా శానిటైజ్ చేయాలి.
 
* ఏటీఎం నుండి వెనుదిరిగిన తర్వాత చేతులను శానిటైజ్ చేసి శుభ్రం చేసుకోవడం మరిచిపోవద్దు.
 

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments