సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (10:33 IST)

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ.. కొత్తగా 1,286 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం కొత్తగా మరో 1,286 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 12 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 68,946కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 563 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
తాజాగా 1066 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 49,675కి చేరింది. 18,708 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 18,708 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. 11,935 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
 
నేడు జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి. 
 
ఆదిలాబాద్ 9, భద్రాద్రి 38, హైదరాబాద్ 391, జగిత్యాల 22, జనగాం 8, భూపాలపల్లి 6, గద్వాల 55, కామారెడ్డి 6, కరీంనగర్ 101, ఖమ్మం 41, ఆసిఫాబాద్ 3, మహబూబ్ నగర్ 39, మహబూబాబాద్ 27, మంచిర్యాల 21, మెదక్ 7, మేడ్చల్ 72, ములుగు 5, నాగర్ కర్నూల్ 29, నల్లగొండ 29, నారాయణపేట 4, నిర్మల్ 4, నిజామాబాద్ 59, పెద్దపల్లి 29, సిరిసిల్ల 0, రంగారెడ్డి 121, సంగారెడ్డి 15, సిద్దిపేట 14, సూర్యాపేట 23, వికారాబాద్ 17, వనపర్తి 14, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 63, యాదాద్రి 3 కేసులు నమోదయ్యాయి.