చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. కంచెలు దాటి పారిపోయారు
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ లాక్‌డౌన్ కొనసాగుతోంది. భారీగా కరోనా కొత్త కేసులు వెలుగుచూడటంతో కఠినమైన కొవిడ్ ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు జెంగ్‌ఝౌ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు కంచెలు దూకి పారిపోయారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీరంతా జెంగ్‌ఝౌలోని యాపిల్ ఐఫోన్ అసెంబ్లింగ్ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్ సంస్థకు చెందిన కార్మికులని చైనాలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఫ్యాక్టరీ నుంచి బయటపడిన వర్కర్లందరూ వందల కిలోమీటర్లు నడుచుకొంటూ తమ స్వస్థలాలకు వెళ్తున్నారని ట్వీట్ చేశారు.