Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. భారత్ ఖాతాలో విజయం.. మూడో వన్డేలో ఆసీస్ చిత్తు (video)

Written By ఠాగూర్
Updated: బుధవారం, 2 డిశెంబరు 2020 (20:26 IST)
భారత్ ఖాతాలో మరో విజయం నమోదైంది. కాన్‌బెర్రా వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. తొల రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. 
 
కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, రవీంధ్ర జడేజాలు చెలరేగి ఆడారు. కేవల 152 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను హార్దిక్ పాండ్యా, రవీంధ్ర జడేజాలు ఆదుకున్నారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 302 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యా కేవ‌లం 76 బంతుల్లో 92 ప‌రుగులు చేయ‌గా.. జ‌డేజా 50 బంతుల్లో 66 ప‌రుగులు చేశారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 ప‌రుగులు జోడించారు. ఒక ద‌శ‌లో 152 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను ఈ ఇద్ద‌రూ ఆదుకున్నారు. 
 
మెల్ల‌గా మొద‌లుపెట్టి చివ‌ర్లో చెల‌రేగిపోయారు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో హోరెత్తించారు. పాండ్యా 7 ఫోర్లు, ఓ సిక్స్ బాద‌గా.. జ‌డేజా 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు కొట్ట‌డం విశేషం. 108 బంతుల్లో 150 ప‌రుగులు జోడించి ఇద్ద‌రూ అజేయంగా నిలిచారు. 
 
అంత‌కుముందు ఓపెన‌ర్లు ధావ‌న్ (16), శుభ్‌మ‌న్ గిల్ (33) విఫ‌ల‌మైనా.. కెప్టెన్ కోహ్లి (63) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మిడిలార్డ‌ర్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (19), రాహుల్ (5) కూడా నిరాశ‌ప‌రిచారు. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఏకంగా నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిందే.
 
ఆ తర్వాత 303 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 49.3 ఓవ‌ర్ల‌లో 289 ప‌రుగుల‌కు ఆలౌటైంది. క‌ళ్లు చెదిరే షాట్ల‌తో మ‌రోసారి మ్యాక్స్‌వెల్ భ‌య‌పెట్టినా.. కీల‌క‌మైన స‌మ‌యంలో అత‌న్ని పెవిలియ‌న్‌కు పంపించి మ్యాచ్‌ను భార‌త్ వైపు పేసర్ జస్ప్రీత్ మ‌లుపుతిప్పాడు. 
 
మ్యాక్స్‌వెల్ కేవ‌లం 38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 59 ప‌రుగులు చేశాడు. విజ‌యానికి మ‌రో 33 బంతుల్లో 35 ప‌రుగులు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో బుమ్రా యార్క‌ర్‌కు క్లీన్‌బౌల్డ‌య్యాడు. ఆ త‌ర్వాత ఆస్ట‌న్ అగార్ 28 బంతుల్లో 28 ప‌రుగులు చేసి పోరాడినా.. ఆసీస్ గ‌ట్టెక్క‌లేక‌పోయింది. అంత‌కుముందు కెప్టెన్ ఫించ్ త‌న అద్భుత‌మైన ఫామ్‌ను కొనసాగించాడు. 82 బంతుల్లో 75 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. టీమిండియా బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ 3, బుమ్రా, న‌ట‌రాజ‌న్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

 

అన్నీ చూడండి

ఉద్యోగం కోల్పోయి డిష్‌వాషింగ్ పనిలో చేరిన 29 యేళ్ల వ్యక్తి... డబ్బు కోసం కాదట...

ఓయ్ బాబూ.. వీళ్లు నన్ను చంపేస్తారు, ప్లీజ్ ఇక్కడ్నుంచి తీసుకెళ్లు: గర్భిణి అన్నట్లుగానే చంపేసారు, వీడియో

స్థానిక పోరులో గొడ్డలి పార్టీ అరాచకాలకు పాల్పడొచ్చు : సీఎం చంద్రబాబు

నేపాల్ వరదల్లో పార్వతీపురం ప్రవాసాంధ్ర కుటుంబం గల్లంత

నేపాల్‌లో హైటెన్షన్ : పొంగిపొర్లుతున్న సరసులు.. కట్టలు తెంచుకుంటున్న నదులు..

అన్నీ చూడండి

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

Vivek Athreya : రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా

Sharva: పల్లెటూరి కుర్రాడి గా భోగి చిత్రంలో తోబుట్టువులతో శర్వా

తర్వాతి కథనం
Show comments