కడక్‌నాథ్ కోడి గురించే వెతికేస్తున్నారు.. అంతా ధోనీ మాయ!

గురువారం, 4 మార్చి 2021 (13:54 IST)
కడక్‌నాథ్ కోడి మాంసం కూడా కోడిలానే నల్లటి రంగులోనే ఉంటుంది. కడక్‌నాథ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అతి తక్కువగా క్రొవ్వు పదార్థం ఉండటమే దీని స్పెషల్. మంచి రుచి.. దానికితోడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో కడక్‌నాథ్ చికెన్‌ ధర కొండెక్కింది. వెయ్యి, పన్నెండొందలు.. ఎంతైనా పెట్టేందుకు ఎవరూ వెనకాడటం లేదు.
 
కడక్‌నాథ్ కోడి బ్రీడ్ ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో అందుబాటులో వుంటాయి. కోడి నలుపు.. మాంసం నలుపు.. అంతేకాదు, దీని గుడ్లు కూడా నలుపే. వాస్తవానికి గుడ్డు మరీ అంత నలుపు కాదు. కాస్త కాఫీరంగుతో ఉంటుంది. అక్కడక్కడ కొన్ని గుడ్లు పింక్ కలర్‌లో వస్తున్నాయి. 
 
కడక్‌నాథ్ కోళ్లను ఇప్పుడు ఇళ్ల దగ్గర కూడా పెంచుకుంటున్నారు. వీటి మాంసం కోసమే కాదు, గుడ్లు కోసం కొంతమంది పెంచుకుంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల బిజినెస్‌లో ఎంతవరకు సక్సెస్ అయ్యాడో తెలీదు కానీ.. అప్పట్నుంచి ఈ చికెన్ మాత్రం బాగా పాపులర్ అయిపోయింది. 
Kadaknath
 
ధోనిని ఆకట్టుకున్న ఈ చికెన్ సంగతేంటో చూద్దామని నెటిజెన్లు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేసేయడంతో మన రెండు రాష్ట్రాల్లో ఈ నల్ల కోళ్లు భలే ఫేమస్ అయిపోయాయి. ధోనీ ఈ కోళ్లు చూసి ముచ్చటపడి ఓ ఫామ్ పెడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో అందరి చూపూ ఈ కోళ్లపై పడింది. 

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments