Festival Posters
✕

కోచ్ గురించి ఫిర్యాదు చేస్తే వారిని వెంటనే జట్టులోంచి తీసేయాలి: మండిపడిన గవాస్కర్

కోచ్ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని వెంటనే జట్టులోంచి తీసేయాలి అంటూ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తేల్చి చెప్పారు. అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్‌ పదవినుంచి తప్పుకోవడం భారత క్రికెట్ చరిత్రలో అతి విషాదకరమైన దినం అంటూ విచారం వ్యక్తం

Written By Raju
Updated: గురువారం, 22 జూన్ 2017 (02:18 IST)
కోచ్ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని వెంటనే జట్టులోంచి తీసేయాలి అంటూ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తేల్చి చెప్పారు. అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్‌ పదవినుంచి తప్పుకోవడం భారత క్రికెట్ చరిత్రలో అతి విషాదకరమైన దినం అంటూ విచారం వ్యక్తం చేసిన గవాస్కర్ ప్రాక్టీస్‌కి డుమ్మా కొడతామంటే ఒప్పుకునే తరహా కోచ్‌ని జట్టు సభ్యులు కోరుకుంటున్నారేమో అంటూ తూర్పార బట్టారు. 
 
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే మధ్య విబేదాల గురించి నాకు చాలా తక్కువగానే తెలుసు. కాని ఇది భారత క్రికెట్‌కు నిజంగానే విషాద దినమని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. అనిల్ కోచ్ బాధ్యతలు స్వీకరించాక టీమిండియా అన్ని విజయాలూ సాధించింది. ఒక్క సంవత్సరంలోనే అనిల్ అంత తప్పు చేసినట్లు నాకయితే కనిపించలేదు. ఏ జట్టులో అయినా విభేదాలు ఉంటాయి. కానీ అంతిమంగా చూడాల్సింది సాధించిన ఫలితాలే అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.  
 
తాను క్రికెట్ ఆడే రోజుల్లో కుంబ్లే గొప్ప పోరాట యోధుడిగా ఉండేవాడు, తీవ్ర గాయాల పాలైనప్పుడు కూడా కట్టుకట్టుకుని మరీ మైదానంలోకి వచ్చి జట్టును గెలిపించాడని గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు. విజయంల కోసం అంత పోరాట పటిమ ప్రదర్శించిన కుంబ్లే ఇప్పుడు ఎందుకు నిలబడలేకపోయాడని గవాస్కర్ విచారం వ్యక్తం చేశాడు. అనిల్ పోరాటాన్ని కొనసాగించకుండా మధ్యలోనే వదిలేయడం తన జీవితంలో ఇదే తొలిసారి అని గవాస్కర్ చెప్పాడు.
 
మెతకగా ఉండే కోచ్‌ను ఆటగాళ్లు కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇవాళ మీరు బాగా అలసిపోయారు కాబట్టి ప్రాక్టీస్‌ అవసరం లేదు. సెలవు తీసుకోండి లేదా షాపింగ్‌కు వెళ్లండి అని చెప్పే కోచ్‌ వారికి కావాలేమో. తీవ్రంగా సాధన చేయించి ఫలితాలు రాబట్టే కోచ్‌ వారికి అవసరం లేదు. నిజంగా కోచ్‌ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని జట్టులోంచి తీసేయాలి అంటూ గవాస్కర్ టీమిండియాలో జరుగుతున్న ధోరణులపై మండిపడ్డాడు.
 
గవాస్కర్ వ్యాఖ్యలు అలా ఉంచితే, సౌమ్యుడు, అంకిత భావానికి నిదర్శనంగా కనిపించే కుంబ్లే అవమానకరంగా రాజీనామా చేయడంపై నెటిజన్లు కెప్టెన్ కోహ్లీపై, బీసీసీపై విరుచుకు పడుతున్నారు. కోహ్లీని ముందుగా జట్టునుంచి సాగనంపి ధోనీని కెప్టెన్ చేయండి అంతా కుదురుకుంటుంది అని నెటిజన్లు మండిపడుతున్నారు.
 

అన్నీ చూడండి

జిల్లేడు చెట్ల లోపల వ్యవసాయ బావిలో 5 కిలోల తనిష్క్ బంగారం, కొట్టేసిన లేడీ ఇన్‌స్టా ఇన్ల్ఫూయెన్సర్ అరెస్ట్

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు త్వరలో ప్రారంభం.. కపట నాటకాలు ఆపండి: రేవంత్ రెడ్డి

మదురై తనిష్క్‌లో చోరీ.. యూట్యూబర్ మీనాక్షిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ప్రియుడు

తొమ్మిది నెలల్లో రూ.56 లక్షలు.. ఇంటి వంటకు క్రేజ్.. 55,000కు పైగా భోజనాలను డెలివరీ

70మంది యువతులను ఆన్‌లైన్‌లో వేధించిన భారతీయ విద్యార్థికి 30 ఏళ్ల జైలు శిక్ష

అన్నీ చూడండి

సీనియర్ నటుడు గిరిబాబు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

జూనియర్ ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి కాంబోలో చిత్రం

ఏమీ లేనపుడు ఎన్నో కావాలని కోరుకుంటాం : అమితాబ్ బచ్చన్

ప్రముఖ సినీనటుడు గిరిబాబు కన్నుమూత

Rajamouli's praise: రాజమౌళి ప్రశంసలతో థియేటర్లలోకి రాబోతున్న తమిళ థ్రిల్లర్ జాన్ డో

తర్వాతి కథనం
Show comments