శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (18:54 IST)

రవిశాస్త్రికే కాదు.. బౌలింగ్ కోచ్.. ఫీల్డింగ్ కోచ్‌లకూ కరోనా

Ravi Shastri
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ లకు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ అని వెల్లడి అయ్యింది. ఈ ముగ్గురు చివరి టెస్టుకు వేదికైన మాంచెస్టర్‌కు వెళ్లబోవడంలేదని మేనేజ్‌మెంట్ వర్గాలు తెలిపాయి. వారు లండన్‌లోనే మరో 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. 
 
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మాంచెస్టర్ వేదికగా ఈ నెల 10న ప్రారంభం కానుంది. రవిశాస్త్రికి ఆదివారం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా నిర్వహించారు. తాజాగా ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితం వచ్చింది. ఆందులోనూ రవిశాస్త్రికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.