సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2017 (15:27 IST)

కోహ్లీ భావోద్వేగాలను నియంత్రించలేకపోయాడు.. అందుకే అలా జరిగింది: గంగూలీ

భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడంతో పాటు వాటి తీవ్రత ఎక్కువ కావడంతో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు. వరుస విజయాలతో దూ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూల్ కెప్టెన్ అనే పేరున్న సంగతి తెలిసిందే. భావోద్వేగాలను బయటపడనీయకుండా హుందాగా మైదానంలో ప్రవర్తిస్తూ.. జట్టు ప్రయోజనాల కోసం ఎంతో పాటుపడిన ధోనీ.. ఈ మధ్య అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోనీ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే..? కోహ్లీ కెప్టెన్సీ విధానంపై మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించడమే కారణం. 
 
భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడంతో పాటు వాటి తీవ్రత ఎక్కువ కావడంతో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఆసీస్‌పై సిరిస్ నెగ్గాలనే గట్టి పట్టుదలతో కోహ్లీ ఉన్నాడని దాదా అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో కోహ్లీ తన భావోద్వేగాల్ని ఎక్కువగా బయటపెట్టాడని ఓ ఇంటర్వ్యూలో గంగూలీ వ్యాఖ్యానించాడు. 
 
ఆసీస్‌పై సిరీస్ నెగ్గడం కీలకమే. కానీ తన భావోద్వేగాలను కోహ్లీ బయటపెట్టేశాడు. అదే అతడి బ్యాటింగ్‌పై ప్రభావాన్ని చూపింది. కోహ్లీ దగ్గర విలువైన ప్రతిభ ఉంది. అతను మళ్లీ మామూలు స్థితికి వచ్చి పరుగులు సాధిస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీలో ఇద్దరు విరాట్ కోహ్లీలున్నారు. ఒకరు కెప్టెన్ అయితే మరో వ్యక్తి పరుగుల వరద పారించేవాడని గంగూలీ చెప్పాడు. ఫిట్‌నెస్ పరంగా అత్యుత్తమ రికార్డులు సాధించిన కోహ్లీ.. మేటి కెప్టెన్ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.