Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ మాట అశ్విన్ వినడం లేదా.. అందుకే పక్కన బెట్టారా? ఇద్దరికీ ఎక్కడ బెడిసింది?

అనారోగ్యం కారణం వల్ల కాకుండా టీమిండియాలో రవిచంద్రన్ అశ్విన్ ఆడకుండా ఉన్న టోర్నీలు, మ్యాచ్‌లు ఎప్పుడైనా లెక్కించారా? బహుశా ఈ విషయంలో అశ్విన్ మీకు దొరికి ఉండడు. ఆశ్చర్యం ఏమిటంటే పూర్తి ఫిట్‌నెస్ కలిగి ఉన్నప్పటికీ ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స

Written By Raju
Updated: శుక్రవారం, 9 జూన్ 2017 (09:45 IST)
అనారోగ్యం కారణం వల్ల కాకుండా టీమిండియాలో  రవిచంద్రన్ అశ్విన్ ఆడకుండా ఉన్న టోర్నీలు, మ్యాచ్‌లు ఎప్పుడైనా లెక్కించారా? బహుశా ఈ విషయంలో అశ్విన్ మీకు దొరికి ఉండడు. ఆశ్చర్యం ఏమిటంటే పూర్తి ఫిట్‌నెస్ కలిగి ఉన్నప్పటికీ ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో జట్టు ప్రధాన ఆటగాడు అశ్విన్‌నే పక్కన పెట్టిన వైనం టీమిండియా అభిమానులను దిగ్భ్రాంతి పరుస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా టాప్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు  తుది జట్టులో చోటు లభించలేదు. తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కూడా అశ్విన్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. 
 
ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించి.. జట్టుకు వెన్నెముకగా ఉన్న అశ్విన్‌కు తుదిజట్టులో చోటు దక్కకపోవడంపై తాజాగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పందించాడు. తుదిజట్టులో స్థానం దక్కకపోవడాన్ని జీర్ణించుకోవడం ఎవరికైనా కష్టమేనని, కానీ జట్టుకూర్పు సమీకరణాలను అశ్విన్‌ అర్థం చేసుకోగలడని కోహ్లి మీడియాతో పేర్కొన్నాడు. 
 
‘అశ్విన్‌ టాప్‌ క్లాస్‌ బౌలర్‌. అది అందరికీ తెలిసిన విషయం. అతను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడు. గత మ్యాచ్‌ సంబంధించిన జట్టుకూర్పును అతను బాగా అర్థం చేసుకున్నాడు. దీనిపై అతనికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వుం ఏం చేసినా నేను అండగా ఉంటానని అతను నాతో చెప్పాడు. మా మధ్య ఉన్న అనుబంధం అది’  అని కోహ్లి వివరించాడు.
 
అశ్విన్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని కోహ్లి అంగీకరించాడు. అయితే, ఇవి మైదానంలో అనుసరించే వ్యూహాలపైనే కానీ, జట్టు సెలెక‌్షన్‌ విషయంలో ఎప్పుడూ విభేదాలు తలెత్తలేదని చెప్పాడు. ‘ఔను, మా మధ్య బౌలింగ్‌ ప్లాన్స్‌, ఇతరత్రా విషయాల్లో విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే అతను చాలా తెలివైనవాడు. సొంత ప్లాన్స్‌తో మైదానంలోకి అడుగుపెడతాడు. అందువల్ల ఇలాంటి విభేదాలు వస్తుంటాయి’ అని వివరించాడు.
 
 

అన్నీ చూడండి

ఎవరూ లేనివేళ ఇంట్లో దూరి మనవరాలిపై తాతయ్య అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

బ్రెయిన్ స్ట్రోక్‍తో మృతి చెంది పలువురి జీవితాల్లో వెలుగులు (వీడియో)

ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్

పోలీసుల్లో పెరుగుతున్న అక్రమ సంబంధాలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీపీ సజ్జనార్

అయోధ్య రామాలయం విరాళలపై పార్లమెంట్‍‌లో స్కిట్ : అతిథి పాత్రలో రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

Rashmika injured : తీవ్రంగా గాయపడ్డ రశ్మిక మందన్న, ఆరు వారాలు విశ్రాంతి

చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంతో కాళాంకి భైరవుడు

Sudheer : మదర్ సెంటిమెంట్ తో సుధీర్స్ జోకర్, తల్లిగా అభిరామి

క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో రంగులు మార్చే మనిషి కకథగా నిరమ్ ట్రైలర్

Kiara Advani : ఎరుపు రంగు దుస్తుల్లో కవ్వించే లుక్ తో కియారా అద్వానీ

తర్వాతి కథనం
Show comments