సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (11:47 IST)

బెయిలుపై విడుదలై 64 యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం...

victim woman
జైలు నుంచి బైయిలుపై విడుదలైన ఓ వ్యక్తి 64 యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గంటూరు జిల్లా పెదనందిపాటు గ్రామంలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అత్యాచారం కేసుల్లో జైలుకు వెళ్లిన ఓ కామోన్మాది. మూడు రోజుల క్రితం బెయిలుపై విడుదలై మరో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈసారి ఏకంగా 64 ఏళ్ల వృద్ధురాలిని కాటేశాడు. తన కామవాంఛ తీర్చుకున్నాక ఆమెను దారుణంగా హత్య చేశాడు. 
 
గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించినప్పటికీ, ఆ వృద్ధురాలు ఓ ఉన్నది ఈ ఘాతుకానికి బలైపోయినట్లు గుర్తించారు. నిందితుడు మంజు 2023లో ఇదే తరహా ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఆ తర్వాత 2024లో కూడా ఓ మహిళపై అత్యాచారానికి ఒడి గట్టాడు. ప్రస్తుతం ఆ కేసులో జైలులో ఉన్న అతడు మూడు రోజుల క్రితమే బెయిల్ పై విడుదలయ్యాడు. వృద్ధురాలు స్థానికంగా స్వీపర్‌గా పనిచేసుకుంటూ గుడిసెలో నివాసం ఉంటోంది. శనివారం రాత్రి వృద్ధురాలిపై అత్యాచారం, హత్యకు ఒడిగట్టిన నిందితుడు వెంటనే పరారయ్యాడు. 
 
ఆదివారం ఉదయం పనికి రాకపోవడంతో, అదే గ్రామంలో ఉంటున్న ఆమె కుమార్తె గుడిసె వద్దకు వచ్చి చూడగా... వృద్ధురాలు రక్తం మరకలతో పాటు ఒంటిపై గాట్లతో కనిపించింది. దీంతో ఆమె పోలీ సులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి సాంబ, మంజు అనే వ్యక్తులు అనుమానంగా తిరగడం గమనించినట్లు స్థానికులు తెలపడంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరిపి మంజు రేప్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.