గురువారం, 6 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (09:38 IST)

బాలానగర్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

fire accident
హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లోని ఓ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఒకరు సజీవదహనమయ్యారు. మృతుడుని బాలానగర్ జలగం సాయి సత్య శ్రీనివాస్‌గా గుర్తించారు. ఇంటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల్లో చిక్కుకోవడంతో ఆయన అక్కడే కాలిపోయాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతుంది. 
 
పటాన్‌చెరు రుద్రాంలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో సత్య శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.