శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 జనవరి 2025 (13:42 IST)

కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న తెలంగాణ భక్తుల బస్సుకి ప్రమాదం: ఒకరు మృతి

Telangana devotees
తెలంగాణ నుండి మహా కుంభమేళా స్నానానికి వచ్చిన భక్తులను తీసుకెళ్తున్న బస్సు అయోధ్యకు వస్తుండగా డంపర్‌ను ఢీకొట్టింది. పురకలందర్‌లోని నౌవా కువా సమీపంలోని రాయ్‌బరేలి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక భక్తుడు మరణించగా, చాలా మంది గాయపడ్డారు.
 
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని లక్నో ట్రామా సెంటర్‌కు పంపారు. మిగతా గాయపడిన వారిని అయోధ్య జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. కాగా మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే.