బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జనవరి 2025 (20:20 IST)

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

Monalisa_Ramcharan
Monalisa_Ramcharan
Monalisa: మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భోంస్లే మహా కుంభమేళాలో మెరిసింది. మహా కుంభమేళాలో రుద్రాక్ష, ముత్యాల హారాలు అమ్ముతూ, సోషల్‌ మీడియాలో రీల్స్‌ పోస్ట్ చేస్తూ వెలుగు చూసిన ఈ మోనాలిసా భోంస్లే ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 
 
ఇప్పటికే ఆమె అందానికి ఫిదా అయిన బాలీవుడ్ సినీ రంగం ఆమెకు ఛాన్స్ ఇచ్చేసింది. అలాగే ఈ మోనాలిసా భోంస్లే రామ్ చరణ్ మూవీలో నటించనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 సినిమాలో చెర్రీ హీరోగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోనాలిసాను కూడా ఈ చిత్రంలో భాగం చేయబోతున్నారు.
 
గేమ్‌చేంజర్‌ తర్వాత, రామ్‌చరణ్ బుచ్చిబాబుతో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మోనాలిసాను ఈ సినిమాలో తీసుకుంటే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. జనవరి 27 నుండి RC16 సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. 
 
జూలై నెలలో షూటింగ్ పూర్తిచేసి దసరాకు సినిమా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కుంభమేళా కారణంగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌కి వచ్చిన ఈ యువతికి ప్రస్తుతం సినీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.